![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.
ఇందులో దాచడం ఏముంది దాని మామ, అమ్మ కలిసి కావాలనే చెడగొడుతున్నారని నారాయణ అంటాడు. బావ ఇలా ప్రతీది క్యాన్సిల్ అవుతుందంటే మనిద్దరికే రాసి పెట్టి ఉన్నట్టుందని మాధవతో గాయత్రి అనగానే ముందు వెళ్లి మీ వాళ్ళని ఒప్పించమని గాయత్రిని నారాయణ కోప్పడతాడు. మరొకవైపు ప్రతాప్, భూషణ్ ఇంటికి వస్తాడు. మహా ఎలా వుంది అని ఆదిని అడుగుతాడు భూషణ్. మహా పెళ్ళి అంటే ఇష్టం లేదంటుందని అతను చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ తన కూతురు మహా దగ్గరికి వెళ్తాడు. ఎప్పటిలాగానే నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్తుంది కానీ అతను వినిపించుకోడు. మరుసటి రోజు అంకుల్ పెళ్లి అయ్యాక వీసా అప్లై చేస్తే ఎక్కువ టైమ్ పడుతుంది. ముందే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నా.. పెళ్లి మీరు అన్న టైమ్ కి చేసుకుంటానని భూషణ్ అనగానే ప్రతాప్ మొదట వద్దని అన్నా తర్వాత ఒప్పుకుంటాడు.
నేను ప్రిపేర్ గా లేనని మహా అంటుంది. అయిన ఎవరు వినరు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కావాలని భూషణ్ అడుగుతాడు. షాపింగ్ కీ వచ్చాను అవన్నీ వెంట తీసుకొని వస్తానా అని మహా కోపంగా మాట్లాడుతుంది. కూల్ మహా ఇక్కడ కూడా ఫోటో తీసుకోవచ్చని హారిక అంటుంది. నాకు తెలిసిన ఫోన్ షాప్ ఉందని చక్రి ఎంట్రీ ఇస్తాడు. తనని తీసుకొని వెళ్ళమని హారిక చెప్తుంది. మహాని తీసుకొని చక్రి వెళ్తాడు. దారిలో తన మాటలతో మహాని చక్రి ఇర్రిటేట్ చేస్తాడు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా మేడమ్ అని అడుగుతాడు. అదంతా నీకు ఎందుకని మహా అంటుంది. వాళ్ళు అయిన అర్థం చేసుకోలేదు వీడు అర్థం చేసుకున్నాడని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |